దొడ్డిదారిన కాదు.. రాజమార్గంలో నాగబాబును రాజకీయాల్లోకి తెస్తున్నా!: పవన్ కల్యాణ్

  • జనసేనలో చేరిన మెగాబ్రదర్
  • కండువా కప్పి ఆహ్వానించిన పవన్
  • నరసాపురం నుంచి పోటీచేస్తారని ప్రకటన
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు జనసేన పార్టీలో ఈరోజు చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకున్న రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలయిందని తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని వ్యాఖ్యానించారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

అందుకే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబును పోటీకి దించుతున్నామని ప్రకటించారు. అన్నింటిని వదులుకుని తన పిలుపు మేరకు అన్న నాగబాబు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేనలో చేరిన నాగబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
nagababu

More Telugu News